ఆదివారం 07 జూన్ 2020
National - Apr 10, 2020 , 15:54:10

డ్ర‌గ్స్ దందా ఆగిపోయింది : ప‌ంజాబ్ సీఎం

డ్ర‌గ్స్ దందా ఆగిపోయింది : ప‌ంజాబ్ సీఎం

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల రాష్ట్రంలో డ్ర‌గ్స్ దందా నిలిచిపోయిన‌ట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతున్న డ్ర‌గ్స్ ఆగిపోయిన‌ట్లు తెలిపారు.  లాక్‌డౌన్ వ‌ల్ల ఏదైనా మంచి జ‌రిగిందంటే, అది ఇదే అన్నారు.  దీనిపై టాస్క్ ఫోర్స్ ప‌నిచేస్తోంద‌న్నారు.  పంజాబ్‌లో మొత్తం 132 క‌రోనా పాజిటివ్ కేసులు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నిజాముద్దీన్ నుంచి పంజాబ్ వ‌చ్చిన వారి సంఖ్య 651గా ఉంద‌న్నారు. దాంట్లో 636 మందిని గుర్తించామ‌న్నారు. మ‌రో 15 మంది కోసం అన్వేషిస్తున్న‌ట్లు చెప్పారు. 

పంజాబ్‌లో మొత్తం 434 వెంటిలేట‌ర్లు అందుబాటులో ఉన్న‌ట్లు సీఎం అమ‌రింద‌ర్ తెలిపారు. 76 ప్ర‌భుత్వం హాస్ప‌త్రుల్లో, 358 ప్రైవేటు హాస్ప‌ట‌ళ్ల‌లో ఉన్నాయ‌న్నారు.  దేశంలో కోవిడ్‌19 సుమారు 80 నుంచి 85 శాతం మందికి సోకే ప్ర‌మాదం ఉంద‌ని భార‌తీయ సైంటిస్టులు, మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్లు ఇచ్చిన డేటా త‌న ద‌గ్గ‌ర ఉంద‌న్నారు.  సెప్టెంబ‌ర్ మ‌ధ్య కాలంలో ఇండియాలో వైర‌స్ తారా స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు సీఎం తెలిపారు.  ఆ స‌మ‌యంలో సుమారు 58 శాతం జ‌నాభాకు వైర‌స్ సంక్ర‌మించే ఛాన్సు ఉంద‌న్నారు.logo