మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 11:59:57

మిడ‌త‌ల‌పై డ్రోన్ల‌తో పెస్టిసైడ్స్ పిచికారి

మిడ‌త‌ల‌పై డ్రోన్ల‌తో పెస్టిసైడ్స్ పిచికారి

ల‌క్నో: కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టిన రాజ‌స్థాన్‌, పంజాబ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా త‌దిత‌ర రాష్ట్రాల్లో మిడ‌త‌ల బెడ‌ద పూర్తిగా తొల‌గిపోవ‌డం లేదు. దీంతో మ‌రో ప్ర‌యత్నంగా కేంద్ర స‌ర్కారు డ్రోన్ల‌తో మిడ‌త‌ల గుంపుల‌పై క్రిమిసంహార‌కాలు స్ప్రే చేయాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలో మిడ‌త‌ల గుంపులు స్వైర విహారం చేస్తున్నాయి. 

కాగా, ఆగ్రా జిల్లాలో మిడ‌త‌ల‌ను సంహ‌రించేందుకు డ్రోన్ల సాయంతో క్రిమిసంహార‌కాలు చ‌ల్లుతున్నామ‌ని వ్య‌వ‌సాయ శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎస్ఎన్ సింగ్ చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసిన నాలుగు డ్రోన్ల సాయంతో మిడ‌త‌ల స‌మూహాల‌పై పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లాలోకి ప్ర‌వేశించిన 60 శాతం మిడ‌త‌ల‌ను సంహ‌రించామ‌ని సింగ్ చెప్పారు.logo