గురువారం 28 జనవరి 2021
National - Nov 29, 2020 , 12:23:05

భారత భూభాగంలోకి పాక్‌ డ్రోన్‌.. సైన్యం కాల్పులు

భారత భూభాగంలోకి పాక్‌ డ్రోన్‌.. సైన్యం కాల్పులు

శ్రీనగర్‌ : దాయాది పాక్‌ వక్రబుద్ధి మారడం లేదు. నియంత్రణ రేఖ వెంట కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. శనివారం రాత్రి జమ్మూకాశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని ఇంటర్నేషనల్‌ బోర్డర్‌ (ఐబీ) వద్ద డ్రోన్‌ గుర్తించినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) ఆదివారం తెలిపింది. ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లోని ఆర్నియా ప్రాంతంలోకి దూసుకువచ్చిందని, కాల్పులు జరుపడంతో తిరిగి వెళ్లిందని పేర్కొన్నారు. అనంతరం డ్రోన్‌ తిరిగిన ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు తెలిపారు. పాక్‌ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనల మధ్య గతవారం పూంచ్‌ జిల్లాలోని మెన్దార్‌ సెక్టార్‌లోని లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (ఎల్‌ఓసీ) వెంట డ్రోన్‌ కదలికలను సైన్యం గుర్తించింది. గత నెలలోనూ కుప్వారా జిల్లాలోని కేరన్‌ సెక్టార్‌లోనూ డ్రోన్‌ను పేల్చివేసింది. పాక్‌ డ్రోన్‌ను వినియోగించి జమ్మూకాశ్మీర్‌లోకి ఆయుధాలను తరలిస్తోంది. సొరంగ మార్గాలు నిర్మించి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తోంది. వారి కోసం ఆయుధాలను డ్రోన్‌ ద్వారా పడేస్తోందని జమ్మూకాశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ ఇటీవల పేర్కొన్నారు. 


logo