గురువారం 28 జనవరి 2021
National - Nov 28, 2020 , 22:57:33

400 గ్రాముల హెరాయిన్‌ పట్టివేత

400 గ్రాముల హెరాయిన్‌ పట్టివేత

ముంబై :  మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో అక్రమార్కులు ఆరితేరిపోతున్నారు. డ్రగ్స్‌ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తెలివిగా దేశాల సరిహద్దులను దాటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అంతర్‌ ఖండాల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌ను ఛేదించారు.

సౌతాఫికా నుంచి వచ్చిన ఓ కొరియర్‌ను పరిశీలించి దాదాపు 400 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  మహిళ ధరించే గౌన్‌ బటన్‌లలో స్మగ్లర్లు హెరాయిన్‌ను కూర్చి కొరియర్‌లో ఇక్కడికి పంపినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ గౌన్‌ ఎవరు.. ఎవరికి పంపారన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo