మంగళవారం 31 మార్చి 2020
National - Mar 12, 2020 , 12:07:39

నక్సల్స్‌ చేతిలో డీఆర్‌జీ జవాన్‌ హత్య

నక్సల్స్‌ చేతిలో డీఆర్‌జీ జవాన్‌ హత్య

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలోని దోర్నపాల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆర్గాట్టా గ్రామంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వర్‌ గార్డ్‌ జవాన్‌ను నక్సల్స్‌ బుధవారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. అనంతరం జవాన్‌ను నక్సల్స్‌ దారుణంగా హత్య చేశారు.

ఈ ఘటనపై సుక్మా ఎస్పీ శాలాబ్‌ సిన్హా స్పందించారు. హోలీ పండుగ కోసం జవాన్‌.. మార్చి 11న తన సొంతూరు ఆర్గాట్టాకు వెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. గ్రామంలోకి జవాన్‌ వచ్చారని తెలుసుకున్న నక్సల్స్‌.. అతన్ని కిడ్నాప్‌ చేసి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


logo
>>>>>>