e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జాతీయం మీకు సెట్టయ్యే డ్రెస్‌ను చెప్తుంది

మీకు సెట్టయ్యే డ్రెస్‌ను చెప్తుంది

మీకు సెట్టయ్యే డ్రెస్‌ను చెప్తుంది

బెంగళూరు, జూలై 18: ఆన్‌లైన్‌లో చూసిన ఓ డ్రెస్‌ మీకు బాగా నచ్చింది. తగిన సైజ్‌ను సెలక్ట్‌ చేసి ఆర్డర్‌ ఇచ్చారు. వారంలో డెలీవరీ పార్సిల్‌ వచ్చింది. తీరా.. తెరిచి చూస్తే.. ఆ డ్రెస్‌ సైజ్‌ మీకు అస్సలు సెట్‌ అవడం లేదు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారికి తరుచూ ఈ అనుభవం ఎదురవుతూ ఉంటుంది. దీంతో వారికి సమయం, కొన్నిసార్లు డబ్బు వృథా అవుతుంటుంది. ఈ సమస్యకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థ పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడే, మీరు కొనాలనుకున్న డ్రెస్‌ మీకు సెట్‌ అవుతుందో లేదో క్షణాల్లో చెప్పేస్తుంది. అంతేకాదు డ్రెస్‌ వేసుకుంటే మీరు ఎలా కనబడుతారో.. 3-డీ అవతార్‌లో చూపిస్తుంది. ఈ కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికతను బెంగళూరుకు చెందిన బిగ్‌థింక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ఫోన్‌తో మన ఫొటో, డ్రెస్‌ ఫోటోను తీసి.. తాము అభివృద్ధి చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్‌ చేస్తే, ఆ డ్రెస్‌ ధరించిన కొనుగోలుదారుడి 3డీ-వెర్షన్‌ ఫొటో కనిపిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సాంకేతికత 95 శాతం కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుందన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మీకు సెట్టయ్యే డ్రెస్‌ను చెప్తుంది
మీకు సెట్టయ్యే డ్రెస్‌ను చెప్తుంది
మీకు సెట్టయ్యే డ్రెస్‌ను చెప్తుంది

ట్రెండింగ్‌

Advertisement