శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 13:47:21

అర్జున్ ట్యాంక‌ర్ నుంచి లేజ‌ర్‌ మిస్సైల్‌ను ప‌రీక్షించిన డీఆర్‌డీవో

అర్జున్ ట్యాంక‌ర్ నుంచి లేజ‌ర్‌ మిస్సైల్‌ను ప‌రీక్షించిన డీఆర్‌డీవో

హైద‌రాబాద్ :  లేజ‌ర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌ను ఇవాళ డీఆర్‌డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.  ఎంబీటీ అర్జున్ ట్యాంక్ నుంచి ఈ ప‌రీక్ష చేప‌ట్టారు. అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని కేకే ప‌ర్వ‌త శ్రేణుల్లో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు.  ఏటీజీఎం ప‌రీక్ష ద్వారా సుమారు 3 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను విజ‌య‌వంతంగా ధ్వంసం చేసిన‌ట్లు డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.   బ‌హుళ విధానాల్లో క్షిప‌ణిని ప‌రీక్షించేందుకు కావాల్సిన సాంకేతిక అంచ‌నాల‌ను ప‌రీక్షిస్తున్న‌ట్లు డీఆర్‌డీవో చెప్పింది.  ఎంబీటీ అర్జున్ ట్యాంక‌ర్ నుంచి లేజ‌ర్ మిస్సైల్‌ను ప‌రీక్షి చేస్తున్న‌ట్లు చెప్పారు.

 


logo