శనివారం 23 జనవరి 2021
National - Dec 23, 2020 , 18:57:56

విజ‌య‌వంతంగా మిసైల్ సిస్ట‌మ్ ట్ర‌య‌ల్స్‌

విజ‌య‌వంతంగా మిసైల్ సిస్ట‌మ్ ట్ర‌య‌ల్స్‌

న్యూఢిల్లీ: భార‌త ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మ‌రో క్షిప‌ణి వ్య‌వ‌స్థ ట్ర‌య‌ల్స్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. భూ ఉప‌రితలం నుంచి ఆకాశంలోకి ప్ర‌యోగించ‌గ‌ల మ‌ధ్య‌శ్రేణి క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ల ట్ర‌య‌ల్స్‌ను డీఆర్‌డీవో స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తిచేసింది. ఈ క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ను భారత ఆర్మీ కోసం డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. ట్ర‌య‌ల్స్‌లో భాగంగా ప‌రీక్షించిన ఓ క్షిప‌ణి ల‌క్ష్యాన్ని విజ‌య‌వంతంగా చేధించింది. స‌రిహ‌ద్దుల్లో చైనాతో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో డీఆర్‌డీవో అన్ని ర‌కాల క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌ల‌ను బ‌లోపేతం చేస్తున్న‌ది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo