నందమూరి స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తన 106వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుంది. చిత్రంలో బాలయ్య మేకోవర్ సరికొత్తగా ఉంటుందని, అఘోరాగా కనిపించి అలరించనున్నాడని తెలుస్తుంది. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి‘బీబీ3 ఫస్ట్ రోర్’ అంటూ ఓ వీడియో విడుదల చేయగా ఇది నందమూరి అభిమానులను హుషారెత్తించింది.
బాలకృష్ణ 106వ సినిమా మోనార్క్ అనే టైటిల్‌తో కొన్నాళ్లుగా ప్రచారం జరుపుకుంటుంది. ఎప్పటి నుండో ఈ సినిమా టైటిల్ ఏంటో చెప్పాలంటూ అభిమానులు మొర పెట్టుకున్నా అవేమి పట్టించుకోని చిత్ర బృందం ఇన్నాళ్లు సాగదీసుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు ఉగాది సందర్భంగా బాలకృష్ణ 106వ సినిమాకు అఖండ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. అలానే టీజర్ కూడా విడుదల చేయగా, ఇందులో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంది. సరికొత్త లుక్‌లో బాలయ్య కనిపించడంతో పాటు టైటిల్ కూడా ఆయనకు యాప్ట్ అయ్యేలా టైటిల్ ఉండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.