బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 10:19:52

మోదీ ప్ర‌సంగిస్తున్న వేళ‌.. ఎర్ర‌కోట‌పై యాంటీ-డ్రోన్ సిస్ట‌మ్‌

మోదీ ప్ర‌సంగిస్తున్న వేళ‌.. ఎర్ర‌కోట‌పై యాంటీ-డ్రోన్ సిస్ట‌మ్‌

హైద‌రాబాద్‌: స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని ఎర్ర కోట నుంచి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌కోట వ‌ద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.  ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌తో పాటు యాంటీ-డ్రోన్ సిస్ట‌మ్‌ను కూడా ఎర్ర‌కోట‌పై ఏర్పాటు చేశారు. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ సిస్ట‌మ్‌.. సుమారు మూడు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మైక్రో డ్రోన్ల‌ను కూడా అడ్డుకోగ‌ల‌దు.  ఆ డ్రోన్ల‌ను డిటెక్ట్ చేసి, వాటిని జామ్ చేయ‌గ‌ల‌దు.  యాంటీ డ్రోన్ సిస్ట‌మ్‌లో ఉన్న లేజ‌ర్‌ కూడా అత్యంత చురుగ్గా ప‌నిచేస్తుంది.  యంటీ డ్రోన్ లేజ‌ర్  సుమారు 2.5 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను  కూల్చ‌గ‌ల‌దు.logo