మంగళవారం 26 జనవరి 2021
National - Jan 01, 2021 , 18:23:17

రాజ్‌నాథ్‌ను క‌లిసిన‌ డీఆర్‌డీవో చీఫ్.. ఆకాశ్ క్షిప‌ణి న‌మూనా బ‌హూక‌ర‌ణ‌

రాజ్‌నాథ్‌ను క‌లిసిన‌ డీఆర్‌డీవో చీఫ్.. ఆకాశ్ క్షిప‌ణి న‌మూనా బ‌హూక‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో) చీఫ్ జీ స‌తీష్‌‌రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. డీఆర్‌డీవో 63వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా వారిద్ద‌రూ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లుసుకున్నార‌ని ర‌క్ష‌ణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ర‌క్ష‌ణ‌మంత్రిని క‌లిసిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు డీఆర్‌డీవో చీఫ్ స‌తీష్‌రెడ్డి ఆకాశ్ క్షిప‌ణి వ్య‌వ‌స్థ న‌మూనాను బ‌హూక‌రించారు. ఇటీవ‌లే ఆకాశ్ క్షిప‌ణుల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo