శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 22:32:02

ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. తృటిలో బయటపడ్డ ఇద్దరు యువకులు!

ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు.. తృటిలో బయటపడ్డ ఇద్దరు యువకులు!

అమరావతి: ముందు వెళ్తున్న బస్సులాగే తామూ నదిని దాటుదామనుకున్న ఇద్దరు స్నేహితులు కారును ముందుకు పోనిచ్చారు. బస్సు అవతలి ఒడ్డుకు చేరుకోగా, కారు చివరివరకూ వెళ్లి ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న యువకులిద్దరూ క్షేమంగా ఒడ్డుకుచేరారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని రాజాపురం గ్రామంలో జరిగింది. 

కడపకు చెందిన యూసుఫ్‌, రాకేశ్‌ ఇద్దరు యువకులు కర్ణాటక రాష్ట్రంలోని బల్లారి నుంచి కడపకు కారులో బయలుదేరారు. కాగా, రాజాపురం రాగానే అక్కడి నది బ్రిడ్జిపైనుంచి ప్రవహిస్తోంది. దీంతో కాసేపు ఆగారు. ఓ బస్సు అదేమార్గంలో వెళ్తుండగా, దాని వెనుకే వీళ్లూ కారును పోనిచ్చారు. అయితే, బస్సు ఒడ్డుకు చేరుకోగా కారు కొద్దిదూరంలో ఆగిపోయింది. ప్రవాహధాటికి మెళ్లగా ఎడమదిక్కుకు వంగింది. అదేవైపు ప్రవాహంలో కొట్టుకుపోయింది. కొద్దిదూరం వెళ్లినతర్వాత ఓ చెట్టుకు తట్టుకుని ఆగిపోయింది. స్థానికులు వెళ్లి అందులోని యువకులను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. బతుకుజీవుడా అంటూ వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, ఈ వీడియోను ఒకరు ట్విట్టర్‌లో పెట్టగా వైరల్‌ అవుతున్నది. మరెందుకాలస్యం మీరూ చూసేయండి..


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo