సోమవారం 08 మార్చి 2021
National - Jan 20, 2021 , 11:38:07

‘డ్రాగన్‌ ఫ్రూట్‌’ పేరు మారుతోంది..

‘డ్రాగన్‌ ఫ్రూట్‌’ పేరు మారుతోంది..

గాంధీనగర్ : డ్రాగన్ ఫ్రూట్‌ పేరును కమలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుజరాత్‌ సీఎం తెలిపారు. పండు బయటి ఆకృతిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రాన్‌ ఫ్రూట్‌.. తామర పుష్పాన్ని పోలి ఉంటుందని, ఈ మేరకు పేరు మార్చనున్నట్లు తెలిపారు. సీఎం హార్టికల్చర్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ను మంగళవారం ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ను కమలం పండ్లుగా పిలిచేందుకు పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. డ్రాగన్‌ ఫూట్‌ పేరు చైనాతో ముడి పడి ఉందని, ఈ మేరకు పేరు మార్చామన్నారు. ఆసక్తికర విషయం ఎంటంటే తామర పువ్వు బీజేపీ చిహ్నం కాగా.. గాంధీనగర్‌లోని గుజరాత్‌ బీజేపీ ప్రధాన కార్యాలయానికి ‘శ్రీ కమలం’ అని పేరు పెట్టారు. డ్రాగన్ అంటే చైనాకు పర్యాయపదం. చైనాను డ్రాగన్ కంట్రీ అని కూడా మనం పిలుస్తుంటాం. సరిహద్దుల్లో చైనా బలగాలు భారత సైనికులను హతమార్చిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చైనా యాప్స్‌కు చెక్ చెప్పడంతో పాటు ఆ దేశంతో వాణిజ్య సంబంధాలను కూడా సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. 

పండు ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్ ఒక ప్రత్యేకమైన రూపంతో పాటు రుచిని కలిగి ఉన్న ఉష్ణమండల పండు. మధ్య అమెరికాకు చెందిన ఈ పండును ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు. పలు దేశాల్లో ‘పిటయా’ పేరుతోనూ పిలుస్తుంటారు. డ్రాగన్ ఫ్రూట్ భారతీయ నగరాల్లో కిలోకు రూ.350 నుంచి 500 రూపాయలకు విక్రయిస్తుంటారు. ఆస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధుల చికిత్సలో డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుందని నమ్ముతారు. యాంటీ ఏజింగ్, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉన్నాయి.

VIDEOS

logo