గురువారం 21 జనవరి 2021
National - Dec 17, 2020 , 16:37:11

డ్యాన్స్ చేయాలని బలవంతం..పెళ్లిని రద్దు చేసుకున్న వధువు

డ్యాన్స్ చేయాలని బలవంతం..పెళ్లిని రద్దు చేసుకున్న వధువు

బరేలీ: వివాహ వేడుకలో  పెళ్లి కొడుకు స్నేహితులు డ్యాన్స్ చేయాలని వధువును బలవంతం చేయడంతో ఆమె తన  పెళ్లిని రద్దు  చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ  సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని  బరేలీ జిల్లాలో గత  శుక్రవారం జరిగింది.  మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కూతురు తమతో డ్యాన్స్‌ చేయాలని పట్టుబట్టడంతో ఇబ్బందిగా ఫీలైన వధువుతో పాటు ఆమె కుటుంబసభ్యులు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నది.   తనను గౌరవించని వ్యక్తిని వివాహం చేసుకోవాలని   నా కూతురుని  బలవంతం చేయలేనని  వధువు   తండ్రి పేర్కొన్నాడు.  

అసలేం జరిగిందంటే..

బరేలీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన    యువకుడు,  కన్నౌజ్‌  జిల్లాకు చెందిన యువతితో కొన్నిరోజుల క్రితం వివాహం నిశ్చయమైంది.   ఇద్దరు  కూడా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు.  పెళ్లి రోజున  వరుడి ఇంటికి పెళ్లి కూతురుతో పాటు ఆమె   బంధువులు చేరుకున్నారు.    వరుడు సంబంధించిన కొంతమంది స్నేహితులు వధువును డ్యాన్స్ చేయాలని డ్యాన్స్‌  ఫ్లోర్‌ మీదకు లాక్కెళ్లారు. వధువును బలవంతంగా లాక్కెళ్లడంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది.  అప్పటి వరకు  సందడిగా  ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 

తన ఇష్టాల్ని గౌరవించలేని వారితో  జీవితాంతం కలిసి ఉండలేనని,  పెళ్లిని రద్దు చేసుకుంటున్నానని వధువు తేల్చి చెప్పింది.    వరకట్నం అడుగుతున్నారని వధువు కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదైంది.    పోలీసుల మధ్యవర్తిత్వంతో వరుడు కుటుంబం వధువుకు రూ.6.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. కొంతమంది హద్దుమీరి వ్యవహరించడంతో   పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి   ఆగిపోయింది. 

ఇవి కూడా చదవండి..

రాజేంద్ర ప్రసాద్ కొడుకు హీరో ఎందుకు కాలేకపోయాడు..?

బ్యూటిఫుల్ లొకేష‌న్ లో హ‌‌న్సికా..ఫొటోలు వైర‌ల్

ఎఫ్ 3 మూవీ..ఎవ‌రికెంత రెమ్యున‌రేష‌న్ తెలుసా...?

బ్లాక్ బ్లాస్ట‌ర్ హిట్ కు సీక్వెల్ రాబోతుందా..?

బాల‌కృష్ణ మూవీ షూటింగ్ ఎక్క‌డో తెలుసా..?

బిగ్ బాస్ నా కెరీర్ కు ప్ల‌స్ అయింది


logo