ఆదివారం 05 జూలై 2020
National - Jun 18, 2020 , 20:02:02

ఇక‌పై ఇంట్లోనే క‌రోనా ప‌రీక్ష చేసుకోవ‌చ్చు : వీడియో

ఇక‌పై ఇంట్లోనే క‌రోనా ప‌రీక్ష చేసుకోవ‌చ్చు :  వీడియో

క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మ‌నుషిలో చాలా మార్పులు వ‌చ్చాయి. ధైర్యంగా ఉండేవాళ్లు కూడా ఇప్పుడు క‌రోనా దెబ్బ‌కి భ‌య‌ప‌డుతున్నారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు లేనివాళ్లు కూడా క‌రోనా ఉందేమో అని ఆందోళ‌న చెందుతున్నారు. పోని, హాస్పిట‌ల్‌కు వెళ్లి టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా ఎక్క‌డ లేనిరోగం అంటించుకుంటామో అని దిగులు. ఇన్ని అనుమానాల‌తో బ‌త‌క‌డం క‌ష్ట‌మని న్యూజిలాండ్‌లోని భార‌త సంత‌తికి చెందిన వైద్యురాలు సంధ్యా రామనాథన్ కొన్నిస‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చింది. ఈమె ఆక్లాండ్‌లోని జనరల్ ప్రాక్టీషనర్ గా పని చేస్తున్న‌ది. ఇంట్లోనే పల్స్ ఆక్సీమీటర్ తో కరోనా ఉందా? అన్న విషయాన్ని గుర్తించవచ్చని ఆమె చెబుతున్నారు. 

1. అన్ని చోట్లా దొరికే, ఈ మిషన్‌ను చూపుడు వేలుకు తగిలిస్తే, శరీరంలో ఆక్సిజన్ ఏ మేరకు సరఫరా అవుతుందన్న విషయాన్ని వెల్లడిస్తుంది. మీటర్ రీడింగ్ 95 నుంచి 100 మధ్యలో ఉండాలని, 93 కన్నా తక్కువగా చూపిస్తే మాత్రం డాక్టర్ ను సంప్రదించాలని అన్నారు. శరీరంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత‌, తొలుత ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గుతుందని ఆమె గుర్తు చేశారు.

2. ఇక రెండు పెద్ద బెలూన్లు తీసుకుని, వాటిలోకి గాలిని ఊదడం ద్వారా ఎంత వేగంగా గాలిని వదులుతున్నారు? శ్వాసను ఎంతవరకూ ఆపగలుగుతున్నారన్న విషయాలను తెలుసుకోవచ్చు. శరీరంలో వైరస్ ఉంటే, ఊపిరిని ఎక్కువసేపు నిలిపి ఉంచలేరని సంధ్య వెల్లడించారు. 

క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. త‌ర‌చుగా ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచే పండ్లు తినాల‌ని చెబుతున్న‌ది. అలాగే ప్ర‌తిరోజూ వేడినీటితో నోరు పుక్కిలించుకోవ‌డం మంచిది అంటున్న‌ది.ఈ ప‌నుల‌న్నీ ఎలా చేయాలో వీడియో ద్వారా తెలియ‌జేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. 
logo