సోమవారం 08 మార్చి 2021
National - Jan 16, 2021 , 06:31:06

స్పుత్నిక్‌-వీ మూడో విడత ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

స్పుత్నిక్‌-వీ మూడో విడత ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి

హైదరాబాద్‌ : దేశంలో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందినట్లు రెడ్డీస్‌ లాబొరేటరి తెలిపింది. మూడో విడతలో దేశవ్యాప్తంగా సుమారు 1500 మందిపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (డీఎస్ఎంబీ) వ్యాక్సిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్ నుంచి డేటాను సమీక్షించిన అనంతరం మూడో దశ ప్రయోగాల కోసం సిఫారసు చేసింది. ఈ సందర్భంగా రెడ్డీస్‌ లాబొరేటరీస్‌ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ కీలకమైన క్లినికల్‌ ట్రయల్స్‌ పురోగతిలో ఇదో ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఈ నెలలోనే మూడో దశ ట్రయల్స్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

భారతీయ ప్రజల కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతేడాది రష్యాకు చెందిన ఔషధ సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌, ఉత్పత్తి కోసం రెడ్డీస్‌ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ (ఆర్డీఐఎఫ్‌)తో ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. గమలేయ నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ స్పుత్నిక్-వీ పేరుతో అభివృద్ధి చేసింది. అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాం ఆధారంగా కొవిడ్‌-19కు వ్యతిరేకంగా ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్ వ్యాక్సిన్‌గా నిలిచింది. రష్యాలో క్లినికల్ ట్రయల్స్‌లో టీకా 91.4% శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.

VIDEOS

logo