గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 16:49:32

గాల్వన్‌ ఘర్షణ.. వైద్యుడిని సస్పెండ్‌ చేసిన సీఎస్‌కే

గాల్వన్‌ ఘర్షణ.. వైద్యుడిని సస్పెండ్‌ చేసిన సీఎస్‌కే

భారత్‌ చైనా మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేవిధంగా ట్వీట్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీం డాక్టర్‌ మధు తొట్టప్పిల్లిల్‌ను జట్టు యాజమాన్యం బుధవారం సస్సెండ్‌ చేసింది.  ‘మధు తొట్టప్పిల్లిల్‌ అవగాహన రాహిత్యంతో చేసిన ట్వీట్‌కు యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదు.. అతను జట్టు డాక్టర్‌ హోదా నుంచి సస్పెండ్‌ చేయబడ్డాడు.’ అని సీఎస్‌కే తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది. డాక్టర్‌ మధు సీఎస్‌కే జట్టుకు ఐపీఎల్‌ ఆరంభం నుంచి పనిచేస్తున్నాడు. అతను ఆటగాళ్లకు మంచి మెడిసన్‌ ఇవ్వడంలో దిట్ట. సోమవారం రాత్రి భారత్‌ చైనా మధ్య ఘర్షణ జరిగిన తరువాత మంగళవారం తొట్టప్పిల్లిల్‌ ట్వీట్‌ చేశాడు. కాగా కొద్దిసేపటికే తన ట్వీట్‌ను తీసేయగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. logo