శనివారం 04 జూలై 2020
National - Jun 03, 2020 , 09:35:45

మహారాష్ర్ట, గుజరాత్ తీర ప్రాంత ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలి

మహారాష్ర్ట, గుజరాత్ తీర ప్రాంత ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలి

న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లా అలీబాగ్‌ సమీపంలో నిసర్గ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ మహారాష్ర్ట, గుజరాత్  తీర ప్రాంత ప్రజలకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  తీర ప్రాంత ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని.. వెనక్కి తిరిగి రావాలని మత్స్యకారులను హెచ్చరించారు. తుపాను ముంబైకి 215 కిలోమీటర్ల దూరంలో, అలీబాగ్‌కు 165 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాల్లో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. 


logo