ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 02:46:21

చిందేస్తున్న ‘చింగారీ’

చిందేస్తున్న ‘చింగారీ’

  • 22 రోజుల్లో కోటిమంది ఫిదా

న్యూఢిల్లీ, జూలై 4: చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన తర్వాత మన దేశానికి చెందిన యాప్‌లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన చింగారీ యాప్‌ను ప్రజలు రికార్డుస్థాయిలో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చిన 22 రోజుల వ్యవధిలోనే కోటి మందికిపైగా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. చింగారీ యాప్‌ సహ వ్యవస్థాపకుడు సుమిత్‌ ఘోష్‌ మాట్లాడుతూ తమ యాప్‌ను కోటిమందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, ప్రతిరోజు దాదాపు 70 లక్షల మంది యాప్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు.


logo