డబుల్ మ్యుటెంట్, బీ.1.1.7పై సమర్థంగా పనిచేస్తున్న టీకా
న్యూఢిల్లీ: ఇండియాలో వెలుగుచూసిన డబుల్ మ్యుటెంట్(బీ.1.617), యూకేలోని ఉత్పరివర్తనం బీ.1.1.7లపై కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నదని క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధ్యయనంలో తేలింది. కొవాగ్జిన్ తీసుకొన్నవారిలో ఈ రెండు రకాల వైరస్‌లకు ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయినట్టు ఆ సంస్థ తెలిపింది. ఐసీఎంఆర్‌తో కలిసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ అధ్యయనం చేసింది.