శనివారం 04 జూలై 2020
National - Jun 20, 2020 , 11:23:27

డ‌బుల్ డెక్క‌ర్ ఉయ్యాల‌.. భ‌లే ఐడియా గురూ!

డ‌బుల్ డెక్క‌ర్ ఉయ్యాల‌.. భ‌లే ఐడియా గురూ!

బిజీగా ఉన్న రోజుల్లోనే  కుర్రాల మైండ్ అస‌లు ఊరుకోదు. కొత్త కొత్త ప్ర‌యోగాలు చేసి ప్ర‌తిభ‌ను చాటుకుంటూ ఉంటారు. అలాంటిది కొవిడ్‌-19 వైర‌స్ కార‌ణంగా స్కూల్, కాలేజ్‌లు మూత‌బ‌డటంతో ప్ర‌తిరోజూ హాలిడేనే. ఇక ఊరుకుంటారా! త‌మ మెద‌డుకు కాస్త ప‌దును పెట్టి ఇదిగో ఇలా డ‌బుల్ డెక్క‌ర్ ఉయ్యాల‌ను త‌యారు చేసేశారు. ఈ ఉయ్యాల‌పై ఒకేసారి ఏకంగా 7, 8 మంది కూర్చొని ఊగేయొచ్చు.

53 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియో చూస్తే పూర్తి క్లారిటీ వ‌స్తుంది. ట్రైన్‌లో లోయ‌ర్ బెర్త్‌, అప్ప‌ర్ బెర్త్ ఉన్న‌ట్లుగా ఉంటుంది. కింద న‌లుగురు, పైన న‌లుగురు కూర్చునే విధంగా సెట్ చేశారు. టైంపాస్ కోసం చేసిన ఉయ్యాల ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదేదో బాగుందే అని ఇంట్లో త‌యారు చేస్తారేమో? కాస్త జాగ్ర‌త్త‌. ఏ మాత్రం తేడా కొట్టినా న‌డుం విర‌గ‌డం ఖాయం. 


logo