సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 09:48:38

దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ రామాయ‌ణం.. సీరియ‌ల్ టైమింగ్ ఇదే

దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ రామాయ‌ణం.. సీరియ‌ల్ టైమింగ్ ఇదే

హైద‌రాబాద్: శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాలు స‌మ‌యం ఆస‌న్న‌మైనా.. ప్ర‌స్తుతం కరోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార‌స‌మాచార శాఖ‌.. మ‌రోసారి రామ‌య‌ణం సీరియ‌ల్‌ను దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం చేయాల‌ని భావిస్తున్న‌ది.  ప‌బ్లిక్ డిమాండ్ నేప‌థ్యంలో.. ఈ సీరియ‌ల్‌ను శ‌నివారం నుంచి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు కేంద్ర స‌మాచార‌శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.  ఈ సీరియ‌ల్ ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి 10 వ‌ర‌కు ఒక ఎపిసోడ్‌, ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌రో ఎపిసోడ్‌ను ప్ర‌సారం చేస్తారు.  తొలిసారి రామ‌య‌ణం సీరియ‌స్ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సారం అయ్యింది. ఈ సీరియ‌ల్ ఇండియ‌న్ టెలివిజ‌న్ రేటింగ్స్‌ను మార్చేసింది. 


logo