e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News హంగ్ అసెంబ్లీ వ‌ద్దు : క‌మ‌ల్‌హాస‌న్‌

హంగ్ అసెంబ్లీ వ‌ద్దు : క‌మ‌ల్‌హాస‌న్‌

కోయంబ‌త్తూరు: మ‌క్క‌ల్ నీధి మ‌య్యిం చీఫ్ క‌మ‌ల్‌హాస‌న్ ఆదివారం ప్ర‌చారంలో పాల్గొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు రాష్ట్రాన్ని ఏలేందుకు స‌మ‌ర్థులు కావ‌న్నారు. ఈసారి జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని, కానీ హంగ్ అసెంబ్లీని ఏర్పాటు చేయ‌వ‌ద్దు అన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేమ‌ని, అందుకే ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గోవాల‌న్నారు. పేద ప్ర‌జ‌ల్లో అభ్యున్న‌తి తీసుకురావాల‌న్న‌దే త‌న కాంక్ష అని, రాజ్యాంగం ప్ర‌కారం సేవ చేయ‌డ‌మే త‌న టార్గెట్ అన్నారు. గ‌త సోమ‌వార‌మే క‌మ‌ల్‌హాస‌న్ .. కోయంబ‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కోయంబ‌త్తూరు త‌న గుండెకు ఎంతో ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని, సిటీలో త‌న‌కు ఎంతో మంది మిత్రులు ఉన్నారని, ఎన్నో జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని, ఇక్క‌డే త‌న జీవితంలో ఎన్నో కీల‌క సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు క‌మ‌ల్ చెప్పారు. గాంధీజీపై ఓ కామెంట్ చేస్తూ.. గాంధీ ఓ గుజ‌రాతీ మాత్ర‌మే కాదు అని, ఆయ‌న నాకు తండ్రి అని క‌మ‌ల్ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement