బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 16:38:50

ఊళ్ల‌కు వెళ్లే ఆలోచ‌న వ‌ద్దు: కేజ్రివాల్‌

ఊళ్ల‌కు వెళ్లే ఆలోచ‌న వ‌ద్దు: కేజ్రివాల్‌

ఢిల్లీ: దేశం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా దేశ‌మంతటా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ అన్నారు. ఢిల్లీ ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. ఢిల్లీలో ఉన్న‌ వ‌ల‌స కూలీలు అంద‌రికీ భోజ‌నం, వ‌స‌తి సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని కేజ్రివాల్ హామీ ఇచ్చారు. వ‌స‌తి స‌దుపాయాలు లేవ‌న్న కార‌ణంగా వ‌ల‌స కూలీలు ఎవ‌రూ ఊళ్ల‌కు వెళ్లే ఆలోచ‌న చేయ‌వ‌ద్ద‌ని ఢిల్లీ సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. వారికి అవ‌స‌ర‌మైన ఆహారం, తాగునీరు, వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పిస్తుందన్నారు. ఎవ‌రూ గ‌డ‌ప‌లు దాటి బ‌య‌ట‌కు రావొద్ద‌ని, లాక్‌డౌన్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని స‌హ‌క‌రించాల‌ని కేజ్రివాల్ కోరారు. 


logo