బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 01, 2020 , 18:23:18

'మా గాయాలకు ఉప్పు రాయకండి' : పుల్వామా అమరవీరుల కుటుంబసభ్యులు

'మా గాయాలకు ఉప్పు రాయకండి' : పుల్వామా అమరవీరుల కుటుంబసభ్యులు

శ్రీనగర్‌ : గత ఏడాది పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల త్యాగాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై అమరవీరుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు సాయం చేయకున్నా పర్వాలేదు కానీ, మా గాయాలకు ఉప్పు మాత్రం రాయకండి అంటూ వారు కన్నీరు పెట్టుకున్నారు. 2019 పుల్వామా ఉగ్ర దాడిలో ఇస్లామాబాద్ పాత్రపై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి జాతీయ అసెంబ్లీలో ప్రసంగంలో “త్యాగాన్ని ప్రశ్నించిన వారిని” బహిర్గతం చేశారని 73 బీఎన్‌కు చెందిన అమరవీర కానిస్టేబుల్ నసీర్ అహ్మద్ భార్య షాజియా కౌసర్ తెలిపారు. "కుట్ర సిద్ధాంతాన్ని ఇటువైపు తిప్పడం ద్వారా వారు మా గాయాలకు ఉప్పు రుద్దుతున్నారు" అని షాజియా విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నేతృత్వంలో దాడి జరిగినట్లు రుజువైనందున కాంగ్రెస్ నాయకులు, 'సాబూత్‌ లాబీ' క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. "ప్రతిపక్ష పార్టీలకు నా అభ్యర్థన ఒకటే.. ఈ మురికి రాజకీయాలను ఆడకండి. ఇలాంటి ఆరోపణలు మన బాధను పెంచుతాయి" అని షాజియా ముకులిత హస్తాలతో అన్నారు.

పుల్వామా బాంబు దాడి జరిగిన వెంటనే కాంగ్రెస్‌తోపాటు పాకిస్తాన్‌కు కొమ్ముకాసే లాబీ ఒకటి పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్పిఎఫ్ సిబ్బంది అమరవీరులయ్యారు. పుల్వామా బాంబు దాడులపై ఆనందం వ్యక్తం చేసినందుకు, ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం చేసిన పెద్ద విజయమని వెల్లడించిన పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌహారీపై షాజియా తల్లి జుబేదా తిట్ల వర్షం కురిపించారు.  "పాకిస్థాన్‌ సిగ్గు పడాలి. నిరాయుధులైన సీఆర్పీఎఫ్ జవాన్లను చంపడం ఎలా పెద్ద విజయం అవుతుంది? మీ అనుకూలవాదులు వెన్నుపోటు పొడవటం వల్ల 40 కుటుంబాలను అనాథలుగా చేశాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయండి" అని జుబేదా కోపంగా చెప్పారు. 

ప్రతిపక్ష పార్టీలు మాకు ఏమీ మంచి చేయలేకపోతే, కనీసం వారు దళాల శౌర్యాన్ని రాజకీయం చేయడం ద్వారా మన ప్రియమైనవారి త్యాగాన్ని తక్కువ చేయకూడదు" అని అమరవీరుడైన కానిస్టేబుల్ రవి కుమార్ సోదరి సిమ్మి పునరుద్ఘాటించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ కేవాడియాలో సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ.. పుల్వామా దాడి తరువాత ప్రతిపక్షాలు చేసిన “అసహ్యకరమైన వ్యాఖ్యలు, ఆరోపణలను” దేశం మరచిపోదని అన్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.