మంగళవారం 26 మే 2020
National - May 22, 2020 , 19:04:23

శవాల ద్వారా కరోనా వ్యాపించదు: ముంబై హైకోర్టు

శవాల ద్వారా కరోనా వ్యాపించదు: ముంబై హైకోర్టు

ముంబై: శవాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, కరోనా వైరస్‌తో మరణించినవారి మృతదేహాలను పూడ్చేందుకు అవసరమైన శ్మశాన వాటికలను గుర్తించే అధికారం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కు ఉందని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను పూడ్చేందుకు 20 శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ముంబైకి చెందిన ప్రదీప్‌ గాంధీ అనే వ్యక్తి గత నెల 9న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం కరోనా మృతదేహాల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేనందును పిటిషన్‌ను కొట్టివేసింది. 


logo