శనివారం 30 మే 2020
National - Mar 29, 2020 , 21:33:04

ఇంటి అద్దెల కోసం ఒత్తిడి చేయొద్దు: కేజ్రివాల్

ఇంటి అద్దెల కోసం ఒత్తిడి చేయొద్దు: కేజ్రివాల్

న్యూఢిల్లీ: క‌రోనా క‌ట్ట‌డి కోసం అమ‌ల్లో ఉన్న లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్. అందులో భాగంగానే ఆదివారం ఢిల్లీ న‌గ‌రంలో కిరాయి ఇండ్ల‌లో ఉంటున్న వారికి ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యం తీసుకున్నారాయ‌న‌. ఇండ్ల య‌జ‌మానులెవ‌రూ మూడు నెల‌లపాటు కిరాయిదారుల‌ను ఇంటి అద్దెల అడుగ‌వ‌ద్ద‌ని కేజ్రివాల్ కోరారు. 

ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చిన త‌ర్వాత ద‌శ‌ల‌వారీగా వారి అద్దెలు వ‌సూలు చేసుకోవాల‌ని ఢిల్లీ సీఎం సూచించారు. అప్ప‌టికి కూడా ఎవ‌రైనా కిరాయిదారులు అద్దెలు చెల్లించ‌డంలో విఫ‌ల‌మైతే ప్ర‌భుత్వ‌మే ఆ మొత్తం చెల్లిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఇంత చెప్పినా ఎవ‌రైనా ఇంటి యాజ‌మానులు అద్దెల కోసం కిరాయిదారుల‌పై ఒత్తిడి చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఆదివారం రాత్రి డిజిట‌ల్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడిన కేజ్రివాల్ ఢిల్లీలోని ఇండ్ల య‌జ‌మానుల‌కు ఈ సూచ‌న‌లు చేశారు.  


logo