సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 22:51:09

జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదా....?

జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ తినకూడదా....?

హైదరాబాద్ : జ్వరం వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరినీ తలెత్తే ఒక సందేహమే ఇది. జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినవచ్చా.. చికెన్, మ‌ట‌న్, ఫిష్ ఈ వంటకాలు అందరికి నోరూరించేవే.. దాదాపు ప్రపంచ జనాభాలో వీటిని తీసుకొనేవారి సంఖ్య ఎక్కువే.. కొంద‌రు తింటారు, ఇంకొంద‌రు భ‌యానికి తిన‌రు. ఈ సమయంలో నాన్ వెజ్ వంట‌కాల‌ను తిన‌రాదా.? తింటే ఏమ‌వుతుంది.? అనే సందేహం చాలా మందికి క‌లుగుతుంది. ప‌చ్చ కామెర్లు వ‌స్తాయ‌ని చాలా మంది అంటుంటారు. మ‌రి ఇందులో నిజ‌మెంత‌..? సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే జీర్ణశక్తి బాగా తగ్గిపోతుంది. అందువల్ల డాక్టర్లు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమంటారు. అలాంటప్పుడు సరిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే లివర్‌పై లోడ్ ఎక్కువగా పెరిగిపోతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అలాంట‌ప్పుడు ప‌చ్చ‌కామెర్లు వ‌స్తాయి.

క‌నుక జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మాంసాహారం అస్స‌లు తిన‌రాదు. తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తింటే మంచిద ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే జ్వ‌రం వ‌చ్చిన వారు మాంస పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు, మన పెద్దలు చెబుతుంటారు. అయితే నిజానికి జ్వ‌రంలో ఉన్న‌ప్పుడు నాన్ వెజ్ తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ప‌చ్చ కామెర్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎలా అంటే ఎక్కువ‌గా హోట‌ల్స్‌లో భోజ‌నం చేసే వారు, బ‌య‌ట దొరికే ఆయిల్ ఫుడ్స్‌, చిరు తిండ్లు తినేవారికి, ఇంట్లో అయినా ఆయిల్ ఫుడ్స్‌, నాన్ వెజ్ వంట‌కాలు బాగా తినే వారికి, కూల్ డ్రింక్స్ ఎక్కువ‌గా తాగేవారికి ప‌చ్చ‌కామెర్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. బాగా మ‌ద్యం సేవించే వారికి కూడా పచ్చ కామెర్లు రావ‌చ్చు. ఎందుకంటే ఈ ప‌నులు చేస్తే లివ‌ర్ గంద‌ర‌గోళానికి గుర‌వుతుంది. దీంతో లివ‌ర్ ప‌నితీరు మంద‌గించి కామెర్లు వ‌చ్చే ప్రమాదం ఉన్నది.


logo