శనివారం 27 ఫిబ్రవరి 2021
National - Jan 22, 2021 , 11:33:28

స‌గం ఉడికిన గుడ్లు తిన‌కండి : ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచ‌న‌లు

స‌గం ఉడికిన గుడ్లు తిన‌కండి : ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచ‌న‌లు

న్యూఢిల్లీ:  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తాజాగా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేసింది.  దేశంలోని ప‌లు ప్రాంతాల్లో బ‌ర్డ్‌ఫ్లూ వ్యాపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పౌల్ట్రీ మాంసాన్ని, గుడ్ల‌ను ఎలా తీసుకోవాల‌ని త‌న సూచ‌న‌ల్లో పేర్కొన్న‌ది.  సగం ఉడికిన గుడ్లు కానీ.. స‌రిగా ఉడ‌క‌ని కోడి మాంసాన్ని తిన‌వ‌ద్దు అని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్ప‌ష్టం చేసింది.  పౌల్ట్రీ మాంసాన్ని స‌రైన రీతిలో ఉడికించాల‌ని పేర్కొన్న‌ది. సుర‌క్షిత‌మైన రీతిలో పౌల్ట్రీ ఉత్ప‌త్తుల్ని తినాల‌ని, వినియోగ‌దారులు కానీ వ్యాపార‌వేత్త‌లు కానీ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు అని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.  కేర‌ళ‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ కేసులు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ నుంచి మార్చి మ‌ధ్య కాలంలో వ‌చ్చే వ‌ల‌స ప‌క్షుల వ‌ల్ల బ‌ర్డ్‌ఫ్లూ వ్యాధి విస్త‌రించే అవ‌కాశాలు ఉన్నాయి.   

ఫుడ్ సేఫ్టీ సూచ‌న‌లు.. 

1. స‌గం ఉడికిన గుడ్లు తిన‌వ‌ద్దు

2.స‌రిగా ఉడ‌క‌ని చికెన్ తినొద్దు

3.ఫ్లూ సోకిన ప్ర‌దేశాల్లో ప‌క్షుల‌ను తాక‌వ‌ద్దు

4. చ‌నిపోయిన ప‌క్షుల‌ను ఉత్త చేతుల‌తో తాకొద్దు

5. ప‌చ్చి మాంసాన్ని బ‌హిరంగంగా పెట్ట‌కండి

6.  ప‌చ్చి మాంసాన్ని నేరుగా తిన‌కండి 

7. ప‌చ్చి మాంసం ప‌ట్టుకునే స‌మ‌యంలో మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధ‌రించండి

8. త‌రుచూ చేతులు క‌డుక్కోండి

9. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోంది

10 చికెన్‌, గుడ్ల‌ను పూర్తిగా ఉడికించిన త‌ర్వాత తినండి  

VIDEOS

logo