శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 24, 2020 , 12:09:01

జీతాలు తగ్గించొద్దు.. ఉద్యోగం తొలిగించొద్దు

జీతాలు తగ్గించొద్దు.. ఉద్యోగం తొలిగించొద్దు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఉద్యోగుల జీతాలు తగ్గించవద్దని, ఉద్యోగులను తొలిగించవద్దని ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇలాంటి చర్యల వల్ల ప్రస్తుత సంక్షోభం మరింత తీవ్రమవుతుందని తెలిపింది. ఉద్యోగి సెలవు తీసుకుంటే, విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించాలని పేర్కొంది. 

మూడు నెలల రేషన్‌ తీసుకోవచ్చు

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) కింద సరఫరా చేసే ఆహార ధాన్యాలను మూడు నెలలకు సరిపడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రుణ పరపతిపై ఎఫ్‌సీఐ నుంచి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా వైరస్‌ నియంత్రణకు కార్పొరేట్‌ సంస్థలు చేసే వ్యయాన్ని వాటి ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)’ కింద పరిగణిస్తామని కేంద్రం సోమవారం తెలిపింది. ఈ మేరకు కార్పొరేట్‌ వ్యవహారాలశాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 


logo