శుక్రవారం 05 జూన్ 2020
National - May 22, 2020 , 15:04:17

మా రాష్ర్టానికి విమానాలు ఇప్పుడే వద్దు

మా రాష్ర్టానికి విమానాలు ఇప్పుడే వద్దు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నెలాఖరు వరకు మిమానాలు నడపకూడదని తమిళనాడు సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నామని కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. అయితే చెన్నైలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతుండటంతో రాష్ర్టానికి విమాన సర్వీసులు ఇప్పట్లో మొదలు పెట్టకూడదని విమానయాన శాఖను పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం కోరింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెన్నైలో సరైన రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో లేవని పేర్కొంది. 

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులతో ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాలు ఈ నెల మొదటి వారంలో చెన్నైలో దిగింది. వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 8795 కరోనా కేసులు నమోదవగా, 95 మంది మరణించారు.  


logo