గురువారం 04 జూన్ 2020
National - Apr 09, 2020 , 12:44:27

ఢిల్లీలో బెంగాలీ మార్కెట్ సీజ్‌..ఫోన్ చేయండి..మీ ఇంటికే స‌రుకులు

ఢిల్లీలో బెంగాలీ మార్కెట్ సీజ్‌..ఫోన్ చేయండి..మీ ఇంటికే స‌రుకులు

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం కట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఢిల్లీ పోలీసులు ఎక్క‌డికక్క‌డ వాహ‌నాల్లో తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. బెంగాలీ మార్కెట్ ఏరియాలో పోలీసుల బృందం పెట్రోలింగ్ చేప‌ట్టింది.

మైక్ ద్వారా ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేస్తూ ఎవ‌రిళ్ల‌లో వారుండాల‌ని సూచించారు. బెంగాలీ మార్కెట్ ఏరియా మూసివేశాం. నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. ప్ర‌జ‌ల కోసం ఫోన్ నంబ‌ర్ల జాబితాను విడుద‌ల చేశాం. ఎవ‌రికైనా నిత్యావ‌సర వస్తువులు, ఇత‌ర స‌రుకులు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి ఆర్డర్ చేయ‌వ‌చ్చు. మీకు కావాల్సిన వ‌స్తువులు మీ ఇంటి వ‌ద్ద‌కే తీసుకువ‌స్తార‌ని ఓ పోలీస్ ఉన్న‌తాధికారి మైక్ ద్వారా ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేశారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo