బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 11:30:21

తాజ్‌ సందర్శన.. క్లింటన్‌ తర్వాత ట్రంపే

తాజ్‌ సందర్శన.. క్లింటన్‌ తర్వాత ట్రంపే

న్యూఢిల్లీ : ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ సందర్శించనున్నారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో తాజ్‌మహల్‌ను సందర్శించిన రెండో వ్యక్తిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. 2000 సంవత్సరంలో భారత పర్యటనకు వచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తాజ్‌మహల్‌ను సందర్శించారు. క్లింటన్‌ వెంట ఆయన కుమార్తె చెల్సియా క్లింటన్‌ కూడా ఉన్నారు. 

2015లో యూఎస్‌ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా కూడా ఇండియాకు వచ్చారు. ఆయన షెడ్యూల్‌లో తాజ్‌మహల్‌ సందర్శన కూడా ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఒబామా.. తాజ్‌ను సందర్శించకుండానే అమెరికాకు తిరుగుపయనం అయ్యారు. ఇక ఇవాళ సాయంత్రం 5:15 గంటలకు ట్రంప్‌ తన కుటుంబంతో తాజ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ గంటసేపు ట్రంప్‌ గడపనున్నారు. ట్రంప్‌ తాజ్‌మహల్‌ సందర్శన నేపథ్యంలో అక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజ్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇవాళ సెలవు ప్రకటించారు. 

మొఘల్ రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ మరణానంతరం ఆమెపై తన ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్‌ను నిర్మించారు. 17వ శతాబ్ధానికి చెందిన ఈ చారిత్రక కట్టడం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. 20 ఏళ్ల పాటు శ్రమించి ఈ కట్టడాన్ని నిర్మించారు.


logo
>>>>>>