బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 12:28:29

బీస్ట్ రోడ్ షో..

బీస్ట్ రోడ్ షో..

హైద‌రాబాద్‌:  అమెరికా, భార‌త స్నేహం వెల్లువిరిసింది.  అగ్ర‌దేశాధినేత డోనాల్డ్ ట్రంప్ .. అహ్మ‌దాబాద్ చేరుకున్నారు.  స‌ర్దార్ ప‌టేల్ విమానాశ్ర‌యం నుంచి స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మం వ‌ర‌కు .. డోనాల్డ్ ట్రంప్ దంప‌తులు రోడ్‌షోలో పాల్గొన్నారు.  ల‌క్ష‌లాది మంది జ‌నం వీధుల వెంట‌.. ట్రంప్‌కు స్వాగ‌తం ప‌లికారు.  రోడ్డు వెంట వేరువేరు రాష్ట్రాల‌కు చెందిన క‌ళానృత్యాల‌ను ఆర్గ‌నైజ్ చేశారు.  వెంట యూఎస్‌, ఇండియా జాతీయ జెండాలు కూడా రెప‌రెప‌లాడాయి.  సుమారు 22 కిలోమీట‌ర్ల రోడ్ షో నిర్వ‌హించారు.  గాంధీ ఆశ్ర‌మంలో సుమారు అర‌గంట పాటు ట్రంప్ దంప‌తులు గ‌డుపుతారు.  రోడ్డు వెంట ఉన్న వేరు వేరు రాష్ట్రాల క‌ళానృత్యాల‌తో సాంస్కృతిక భిన్న‌త్వాన్ని చాటారు.  బీస్ట్ కారులోనే ట్రంప్ త‌న రోడ్‌షో నిర్వ‌హించారు. 


logo
>>>>>>