బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 16:24:52

'గ్రీన్‌ టీ' మాత్రమే తాగిన ట్రంప్‌

'గ్రీన్‌ టీ' మాత్రమే తాగిన ట్రంప్‌

అహ్మదాబాద్‌:  అహ్మదాబాద్‌ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా కోసం ఘుమఘుమలాడే గుజరాతీ వంటకాలను సిద్ధం చేశారు. ట్రంప్‌ మెనూలో ఖమాన్‌, బ్రకోలీ సమోస, హనీ-డీప్‌ కుకీస్‌, మల్టీ గ్రేన్‌ రోటీస్‌, కొబ్బరినీళ్లు, ఐస్‌ టీ, స్పెషల్‌ ఛాయ్‌లను చేర్చారు. వీటిని ప్రముఖ చెఫ్‌ సురేశ్‌ ఖన్నా తయారు చేశారు. ట్రంప్‌ సబర్మతీ ఆశ్రమంలో కేవలం 'గ్రీన్‌ టీ' మాత్రమే సేవించారు.  ట్రంప్‌ కోసం వివిధ రకాలైన స్నాక్స్‌తో  తేనీటి విందు ఏర్పాటు చేశారు. కానీ, ఆ గుజరాతీ వంటకాలను ట్రంప్‌ రుచిచూడలేదు.  అంతకుముందు అహ్మదాబాద్‌  సబర్మతి   ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దంపతులు సందర్శించారు.  ఆశ్రమ విశిష్టత, గాంధీ అనుసరించిన జీవన విధానాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ దంపతులకు మోదీ వివరించారు. 


logo