శనివారం 28 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 16:33:50

అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై బీజేపీ అధ్య‌క్షుడి కామెంట్‌

అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై బీజేపీ అధ్య‌క్షుడి కామెంట్‌

 హైద‌రాబాద్‌:  అమెరికా ఎన్నిక‌ల‌పై బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కామెంట్ చేశారు.  బీహార్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ద‌ర్బంగాలో ఇవాళ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు.  అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలుబ‌డుతున్నాయ‌ని, అయితే కోవిడ్‌19 మ‌హ‌మ్మారిని ట్రంప్ స‌రైన రీతిలో ఎదుర్కొలేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌న్నారు.  కానీ 130 కోట్ల మంది ఉన్న భార‌తీయుల‌ను కాపాడుకునేందుకు ప్ర‌ధాని మోదీ స‌రైన నిర్ణ‌యం తీసుకున్నార‌ని న‌డ్డా అన్నారు. బీహార్‌లో ఈ నెల ఏడ‌వ తేదీన మూడ‌వ విడుత ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి.  ఫ‌లితాలు 10వ తేదీన వెల్ల‌డి కానున్నాయి.