రీఫార్మ్స్కిదే టైం..ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు దువ్వూరి అడ్వైజ్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ద్రవ్య సంస్కరణలను అమలు చేయడానికి ఇదే సరైన సమయం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు హితవు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్నదని ఆయన ఒక ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. గత ఆర్థిక మంత్రులతో పోలిస్తే ప్రస్తుత విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఏకైక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గత ఆర్థిక మంత్రులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. పొదుపు చర్యలు పాటించేవారని దువ్వూరి చెప్పారు. కానీ నిర్మలాసీతారామన్ తీరు అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. ఉత్పత్తికి మద్దతు ఇవ్వాలా? వినియోగం పెరుగుదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలా? అన్న సంగతి నిర్మలా సీతారామన్ తేల్చుకోవాలన్నారు.
ఉపాధి కల్పన ద్వారా పేదలను ఆదుకోవాలని దువ్వూరి సుబ్బారావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)ను విస్తరించడమే తెలివైన చర్య అని అభిప్రాయ పడ్డారు. పేదలకు నగదు అందుబాటులోకి తెస్తే, వారు ఉత్పత్తిని పెంపొందిస్తారని, తద్వారా మరిన్ని ఉద్యోగాలు రావడంతోపాటు వినియోగం పెరుగుతుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్
- ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి