మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 25, 2020 , 18:38:27

‘సుప్రీంకోర్టు తీర్పును మీరు ముందే ఊహించవద్దు.. ’

‘సుప్రీంకోర్టు తీర్పును మీరు ముందే ఊహించవద్దు.. ’

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కౌంటర్ ఇచ్చారు. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పును మీరు ముందే ఊహించవద్దంటూ ఆదివారం ట్విట్టర్‌లో చురకలంటించారు. ‘డియర్ రవి శంకర్ ప్రసాద్ జీ, ఆర్టికల్ 370ని మీరు పునరుద్ధరిస్తారని మేం ఆశించడం లేదు.  సుప్రీంకోర్టు స్వేచ్ఛ, అధికారాలు మీ ఆదేశాలపై ఆధారపడినట్లుగా ఊహించవద్దు.  గౌరవనీయులైన న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల గురించి మీకు ముందే తెలుసు అన్నట్లుగా మాట్లాడవద్దు’ అని ఎద్దేవా చేశారు.

జమ్ముకశ్మీర్ జెండా వెనక్కి వస్తేనే జాతీయ జెండాను ఎగురేస్తామన్న పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవి శంకర్ శనివారం ఖండించారు. ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరణ కాదని చెప్పారు. కాగా రవి శంకర్ వ్యాఖ్యలపై స్పందించిన ఒమర్ అబ్దుల్లా ఈ మేరకు ట్విట్టర్‌లో ఆదివారం కౌంటర్ ఇచ్చారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.