శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 17:59:47

డాన్‌ చోటా షకీల్‌ మరో సోదరి మృతి

డాన్‌ చోటా షకీల్‌ మరో సోదరి మృతి

ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ చోటా షకీల్‌ పెద్ద అక్క హమీదా సయ్యద్ (57) మంగళవారం మరణించారు. థాణే జిల్లాలోని ముంబ్రాలో భర్త ఫరూక్‌ సయ్యద్‌, కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఆమె కొన్నేండ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. అయితే ఆమె కరోనా వల్ల మరణించినట్లు తెలుస్తున్నది. కాగా చోటా షకీల్‌ చిన్న అక్క ఫహ్మిదా షేక్ (50) గత నెల ముంబైలో చనిపోయారు. ఆమెకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. నెల రోజుల్లో ఇద్దరు సోదరిలను కోల్పోయిన చోటా షకీల్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తున్నాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన అతడు దేశంలో జరిగిన పలు నేరాలకు సంబంధించి మోస్ట్‌ వాటెండ్‌ జాబితాలో ఉన్నాడు. 
logo