బుధవారం 03 జూన్ 2020
National - May 23, 2020 , 15:52:35

గ్రీన్‌ స్టేటస్‌ ఉంటే.. క్వారంటైన్‌ అవసరం లేదు

గ్రీన్‌ స్టేటస్‌ ఉంటే.. క్వారంటైన్‌ అవసరం లేదు

న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు లేనివారు, ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్‌ స్టేటస్‌ ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరి వెల్లడించారు. ఆరోగ్య సేతు యాప్‌ పాస్‌పోర్టు లాంటిందని చెప్పారు. ఆర్యోగ సేతు యాప్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవని, దాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించాలన్నారు. త్వరలో అంతర్జాతీయ విమానాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. విమానయానానికి సంబంధించి ఆయన ఈ రోజు ఫేస్‌బుల్‌ లైవ్‌లో పలువురి సందేహాలకు సమాధానాలిచ్చారు. విదేశాల నుంచి వచ్చేవారు 14 రోజులపాటు క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని చెప్పారు.

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్‌ అత్పనిసరి అని విమానయాన శాఖ పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించి నేటితో 60 రోజులు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించారు. మొదటి విడత లాక్‌డౌన్‌ మార్చి 31 వరకు కొనసాగింది. ప్రస్తుతం నాలుగో విడత లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.


logo