మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 13:39:51

ఈ నష్టాలు శాశ్వతం కాదు: గోవా గవర్నర్‌

ఈ నష్టాలు శాశ్వతం కాదు: గోవా గవర్నర్‌

పనాజీ: అరేబియా సముద్ర తీరంలో ఉన్న గోవా రాష్ట్రానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. దేశవిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో గోవా కలకలలాడేది. కానీ గత మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో గోవాలో పర్యాటక రంగం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. అయితే ఇప్పుడు గోవాల కరోనా రహిత రాష్ట్రంగా నిలువడంతో ఆ రాష్ట్ర యంత్రాంగం పర్యాటక రంగానికి ద్వారాలు తెరిచింది.

ఈ మేరకు గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ శనివారం ఆ రాష్ట్ర పర్యాటక రంగ భవిష్యత్తుపై మాట్లాడారు. ‘ప్రస్తుతం గోవా పర్యాటక రంగంలో చోటుచేసుకున్న నష్టం దీర్ఘకాలిక నష్టం కాదు. ఇది పరిస్థితి తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు గోవా కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఉంది. స్వదేశీ టూరిస్టులు గోవాకు రావచ్చు. అయితే విదేశీ టూరిస్టులు గోవాను సందర్శించడానికి మాత్రం మరికొన్ని రోజులు సమయం పడుతుంది’ అన్నారు. 


logo