సోమవారం 01 జూన్ 2020
National - May 15, 2020 , 14:00:10

అంతర్జాతీయ ప్రయాణికుల కోసమే ఎయిర్‌ ఇండియా సేవలు

అంతర్జాతీయ ప్రయాణికుల కోసమే ఎయిర్‌ ఇండియా సేవలు

ఢిల్లీ : వందే భారత్‌ మిషన్‌ రెండో దశ రేపు ప్రారంభం కానుంది. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. రెండవ దశలో 31 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా ఓ ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకున్న వారికోసం ఇంటర్నేషనల్‌ కనెక్టింగ్‌ ప్యాసింజర్స్‌ వెళ్లేందుకు, వచ్చేందుకే మాత్రమే దేశీయ విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఎయిర్‌ ఇండియా స్పష్టం చేసింది. వందే భారత్‌ మిషన్‌ రెండవ దశలో మొత్తం 149 విమానాలు నడుపుతున్నట్లు తెలిపింది. 31 దేశాల నుంచి భారతీయులను తిరిగి తీసుకురానుంది. 149 విమనాల్లో యూఎస్‌ నుంచి 13 విమానాలు, యూఏఈ నుంచి 11, కెనడా-10, సౌదీఅరేబియా-9, యూకే-9, మలేషియా-8, ఒమన్‌-8, కజికిస్థాన్‌-7, ఆస్ట్రేలియా నుంచి 7 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొంది. 

 విదేశాల్లో చిక్కుకున్న ప్రయాణికులతో దేశీయంగా రెండో దశలో కేరళకు 31 విమానాలు చేరుకోనున్నాయి. అదేవిధంగా ఢిల్లీకి 22, కర్ణాటక-17, తెలంగాణ-16, గుజరాత్‌-14, రాజస్థాన్‌-12, ఆంధ్రప్రదేశ్‌కు-8, పంజాబ్‌-7, బిహార్‌-6, ఉత్తరప్రదేశ్‌-6, ఒడిశా-3, చండీగఢ్‌-2, జమ్ముకశ్మీర్‌, జైపూర్‌, ముంబయి, మద్యప్రదేశ్‌కు ఒక్కో విమానం చేరుకోనుంది. పౌరవిమానయానశాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ లాక్‌డౌన్‌ కారణంగా ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకువస్తుంది.


logo