శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 31, 2020 , 15:31:57

విగ్ర‌హంతో ఆడుకుంటున్న కుక్క‌.. ఎంత‌కీ క‌ద‌ల‌క‌పోవ‌డంతో విసుగొచ్చింది!

విగ్ర‌హంతో ఆడుకుంటున్న కుక్క‌.. ఎంత‌కీ క‌ద‌ల‌క‌పోవ‌డంతో విసుగొచ్చింది!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యే వీడియోలు కొన్ని చాలా ఫ‌న్నీగా ఉంటాయి. ఒక కుక్క విగ్ర‌హంతో ఫెచ్ ఆడ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ది. ఫెచ్ ఆడుతున్న వీడియో నెటిజ‌న్ల‌ను న‌వ్విస్తున్న‌ది. దీనికి సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ ట్విట‌ర్ ద్వారా పంచుకున్నారు. 31 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో కుక్క బంతితో ఆడుకుంటున్న‌ది. 

ఒక వ్య‌క్తి విగ్ర‌హం రెండు కాళ్ల మ‌ధ్య‌లో బంతి వ‌చ్చి ప‌డింది. కుక్క బంతి ద‌గ్గ‌ర‌కు వెళ్లేస‌రికి అక్క‌డ మ‌నిషి ఉన్న‌ట్లు అర్థ‌మైంది. ఇది విగ్ర‌హం అని కుక్క‌కు తెలియ‌దు. శిల మీద కూర్చున్న వ్య‌క్తిగా భావించింది. త‌ర్వాత బంతిని పాదాల వైపుకు నెట్టింది. అత‌ను బంతిని పాస్ చేస్తాడేమో అని ఎదురు చూసింది. కాని అది జ‌ర‌గ‌లేదు. అత‌ను ఎంత‌సేప‌టికీ క‌ద‌ల‌క‌పోయేస‌రికి కుక్క బంతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. "హే, మీరు ఎందుకు బాల్‌తో ఆడ‌డం లేదు మ్యాన్ఎం?' అనే శీర్షిక‌ను జోడించారు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 


   


logo