న్యూఢిల్లీ: ఒక పెంపుడు కుక్క బాలికతో దాగుడుమూతలు ఆట ఆడింది. ట్విట్టర్ యూజర్ బ్యూటెంజిబిడెన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోడ వద్దకు వెళ్లి కళ్లు మూసుకోమని బెల్జియన్ షెపర్డ్ డాగ్‌కు ఒక బాలిక చెబుతుంది. దీంతో అది గోడ వద్దకు వెళ్లి కళ్లు మూసుకుంటుంది. మధ్యలో ఒకసారి కళ్లు తెరిచి చూస్తుంది. మళ్లీ కళ్లు మూసుకుంటుంది. అనంతరం బాలికను వెతికి పట్టుకునేందుకు వెళ్తుంది.
కాగా, పెంపుడు కుక్క దాగుడుమూతలు ఆడిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్య పోయారు. పెంపుడు జంతువులు ఇలాంటి ఆటలు ఆడటం తాము ఎప్పుడూ చూడలేదన్నారు.