న్యూఢిల్లీ: ఒక కుక్క మూతిపై ఫెడేల్మని పిల్లి పిల్ల కొట్టింది. తన చిన్ని కాలితో కుక్క మూతి చెళ్లుమనిపించింది. ఊహించని ఈ ఘటనకు షాక్ అయిన ఆ పెంపుడు కుక్క.. పిల్లి పిల్లపై కనుగుడ్లు ఉరిమింది. నవ్వులు పూయించే ఈ వీడియోను ‘యానిమల్స్ బీయింగ్ జర్స్’ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు.
బెడ్ రూమ్లో కిటికీ అంచు వద్ద ఒక పెంపుడు కుక్క కూర్చొని ఏదో నములుతున్నది. ఆ కిటికీ వెనుకవైపునకు వచ్చిన పిల్లి పిల్లను అది చూసింది. దీంతో ఆ పిల్లి పిల్ల తన కాలితో కుక్క మూతిపై ఒక్కటిచ్చింది. ఊహించని ఈ ఘటనకు షాక్ తిన్న ఆ కుక్క నమలడాన్ని ఆపి కనుగుడ్లను ఎగురవేసింది.
‘యానిమల్స్ బీయింగ్ జర్స్’ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకున్నారు. పలు ఫన్నీ కామెంట్లు కూడా చేశారు.