సోమవారం 18 జనవరి 2021
National - Jan 11, 2021 , 01:33:06

అడవి సింహాన్ని తరిమిన గ్రామసింహం!

అడవి సింహాన్ని తరిమిన గ్రామసింహం!

ప్రాణం పోక తప్పదు అనుకొన్న సమయంలో పుట్టుకువచ్చే ధైర్యానికి ఈ కుక్క ఓ ఉదాహరణ. గుజరాత్‌లోని ససాన్‌ అడవిలో తనను చంపడానికి వచ్చిన సింహం పైకి ఓ వీధి కుక్క శివంగిలా దూకింది. గట్టిగా మొరుగుతూ దాన్ని భయపెట్టింది. కుక్క ధైర్యాన్ని చూసి సింహానికి భయం వేసింది. వెనకడుగు వేసింది. కుక్క మరింత ముందుకు వెళ్లి సింహాన్నే తరిమికొట్టింది. పర్యాటకులు ఓ జీపులో ఉండి ఈ వీడియోని తీశారు.