బుధవారం 27 జనవరి 2021
National - Jan 13, 2021 , 12:05:13

భ‌క్తుల‌కు శున‌కం ఆశీర్వాదం.. వీడియో వైర‌ల్‌

భ‌క్తుల‌కు శున‌కం ఆశీర్వాదం.. వీడియో వైర‌ల్‌

ఆల‌యానికి వెళ్లిన భ‌క్తుల‌కు ద‌ర్శ‌న అనంత‌రం అర్చ‌కులు ఆశీర్వాదం ఇవ్వ‌డం స‌హ‌జం. కానీ ఈ ఆల‌యం వ‌ద్ద అర్చ‌కుల‌తో పాటు ఓ శున‌కం భ‌క్తుల‌కు ఆశీర్వాదం ఇస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌హారాష్ర్ట సిద్ధ‌హాతేక్‌లోని సిద్దివినాయ‌క టెంపుల్ వ‌ద్ద ఈ దృశ్యం కనిపించింది. ఆల‌యం వెలుప‌లి ద్వారం వ‌ద్ద కూర్చున్న శున‌కం.. బ‌య‌ట‌కు వ‌స్తున్న భ‌క్తుల‌కు షేక్ హ్యాండ్ ఇస్తోంది. ఇక త‌న ముందు రెండు చేతులు జోడించి న‌మ‌స్క‌రించిన వారికి.. త‌న ముందు కాళ్ల‌తో ఆశీర్వాదం ఇస్తోంది శున‌కం. ఈ దృశ్యాల‌ను అరుణ్ లిమాదియా అనే నెటిజ‌న్ త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 


logo