గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 11:33:28

అయ్యో పాపం.. టిక్‌టాక్ చేస్తుంటే కుక్క క‌రిచింది!

అయ్యో పాపం.. టిక్‌టాక్ చేస్తుంటే కుక్క క‌రిచింది!

కొన్ని ప్ర‌మాద సంఘ‌ట‌న‌లు చూస్తే అయ్యోపాపం అనాల్సింది పోయి ‌'బాగా అయిందా' అని అనాల‌నిపిస్తుంటుంది. ఇలాంటి ప్ర‌మాదాలు టిక్‌టాక్ వీడియో చేస్తున్న‌ప్పుడు జ‌రిగితే మాత్రం మొహ‌మాటం లేకుండా 'తిక్క కుద‌రిందా' అని అంటున్నారు నెటిజ‌న్లు.

టిక్‌టాక్ పిచ్చిలో ప‌డి యువ‌త‌రం చుట్టూ ప‌రిస‌రాల‌ను ప‌ట్టించుకోకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. పార్కులు, రోడ్లు ఎక్క‌డ బ‌డితే అక్క‌డ టిక్‌టాక్‌లు చేస్తూ ఫేమ‌స్ అవ్వాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక అమ్మాయి త‌మ అపార్ట్‌మెంట్ ప్రాంగ‌ణంలో డ్యాన్స్ చేస్తున్న‌ది. ఇదే మంచి స‌మ‌యం అనుకున్నట్టున్న‌ది కుక్క‌. ఒక‌సారిగా వ‌చ్చి అమ్మాయి తొడ ప‌ట్టుకున్న‌ది. దీంతో అమ్మాయి భ‌య‌ప‌డి కుక్క‌ను వ‌దిలించుకొని పారిపోయింది. అమ్మాయి డ్యాన్స్ వీడియో పాపుల‌ర్ అయ్యేదో లేదో తెలియ‌దు కాని, ఇప్పుడు మాత్రం జీరో అయింది. అయితే.. కుక్క‌కు మాత్రం మంచి పేరొచ్చిందంటూ నెటిజ‌న్లు తెగ న‌వ్వుకుంటున్నారు. logo