సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 07:55:21

ఎన్డీఏ అసలు ఉనికిలో ఉందా : సామ్నా

ఎన్డీఏ అసలు ఉనికిలో ఉందా : సామ్నా

ముంబై : నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్డీఏ) నుంచి శిరోమణి అకాలీదళ్‌ వైదొలిగిన తర్వాత బీజేపీ సారథ్యంలోని కూటమి.. ఇంకా ఉనికిలో ఉందా? అంటూ శివసేన అధికార పత్రిక సామ్నా ఎద్దేవా చేసింది. ‘ఎన్డీఏ మూలస్తంభాల్లో చివరిదైన అకాలీదళ్‌ కూటమి నుంచి వైదొలుగుతున్నా నిలువరించేందుకు ప్రయత్నించలేదు. అంతకు ముందు శివసేన తప్పుకుంది. ఇక ఆ కూటమిలో మిగిలి ఉన్నదేంటి?’ అని నిలదీసింది.  మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏకాభిప్రాయం కుదరక బీజేపీతో విభేదించి శివసేన గతేడాది ఎన్డీఏ కూటమి నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు పలు పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి. కొంతకాలంగా ఆయా పార్టీలు స్థానిక రాజకీయ సమీకరణాల ప్రకారం కూటమి నుంచి బయటకు వస్తున్నాయని పేర్కొంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo