బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 21:19:26

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో చోరీ..

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో చోరీ..

న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. తాము ఎంపీకి బాగా తెలిసిన వాళ్లమని కొంతమంది వ్యక్తులు హుమాయిన్ నగర్ రోడ్డులోని తిలక్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్ కు సమీపంలో గల ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎంపీ ఇంట్లో ఉన్న సిబ్బందిపై దాడి చేసి పలు కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు. ఎంపీకి చాలా దగ్గరి వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 



logo
>>>>>>